శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు

సెప్టెంబర్ 15 నుండి 23 వ తేది వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ 9 రోజుల పాటు ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసింది.

వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగింది. ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *