శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం

 

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం ఉద‌యం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మ‌హోత్స‌వాలు నిర్వహిస్తున్న విష‌యం విదిత‌మే. ఈ రోజు నుండి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు సుబ్రహ్మణ్యస్వామి వారి హోమం జరుగనుంది.

ఇందులో భాగంగా యాగశాలలో శుక్రవారం ఉదయం పూజ, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వ‌హించారు.

కాగా ఈ నెల 27వ తేదీ శ్రీ దక్షిణ మూర్తి స్వామి వారి హోమం జరుగనుంది. అనంతరం సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం జరుగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *