శ్రీవారి పుష్కరిణిలో శ్రీవారి తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌

తిరుమలలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్‌రన్‌ నిర్వహించారు.

తెప్పోత్సవాలకు తెప్పలను పూర్తిగా సిద్ధం చేశారు. తొలిరోజు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై విహరిస్తారు. చివరి మూడురోజులు శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు తెప్పపై భక్తులకు దర్శనమిస్తారు. మొదటి మూడు రోజులు మూడుసార్లు, 4వ రోజు ఐదుసార్లు, చివరిరోజు ఏడుసార్లు స్వామి, అమ్మవారు పుష్కరిణిలో తెప్పలపై ప్రదక్షిణలు చేస్తారు.

కాగా, తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 27, 28, మార్చి 1వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *