కేదార్‌నాథ్(2026): ఈ ఏడాది కేదార్‌నాథ్ ఎప్పుడు తెరుచుకుంటుంది?

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సముద్రమట్టానికి 3583 మీటర్ల ఎత్తులో నెలకొని ఉన్న కేదార్‌నాథ్ దివ్యధామం సంప్రదాయం ప్రకారం సాధారణంగా ఏప్రిల్ చివరిలో లేదా మే నెల ప్రారంభంలో వచ్చే అక్షయతృతీయ రోజున  తెరువబడుతుంది. ఈ ఏడాది(2026) ఏప్రిల్ 22, ఉదయం 8.00 గంటల సమయంలో ఈ కేదార్‌నాథ్ దేవాలయాన్ని సంప్రదాయబద్ధమైన వేదమంత్రాల మధ్య తెరువనున్నారు. 

కేదారేశ్వర స్వామి శీతాకాల ఆశ్రమం కొలువై ఉన్న ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర ఆలయంలో సంప్రదాయ ఆచారాలు పూర్తయిన తరువాత బద్రీనాధ్, కేదార్ నాథ్ ఆలయ కమిటీ(బికెటిసి)  ప్రారంభ, తుది తేదీలను ప్రకటిస్తూ ఉంటుంది. 

కేదార్ నాథ్ కపట్ ప్రారంభ డోలి యాత్ర కార్యక్రమం

మొదటిరోజు: కేదార్ నాథ్ జీ పంచముఖి డోలీ ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర ఆలయం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇది గుప్తకాశి లోని విశ్వనాథ ఆలయానికి చేరుకుని రాత్రి అక్కడే బసచేస్తుంది.

రెండవరోజు: కేదార్నాథ్ డోలీ గుప్తకాశీ నుండి ఫాటాకు చేరుకుంటుంది. రాత్రి ఫాటాలో ఆగుతుంది.

మూడవరోజు : కేదార్ నాథ్ డోలీఫాటా నుండి గౌరీకుండ్ కు బయలుదేరుతుంది. అది రాత్రి గౌరీకుండ్ లో ఆగుతుంది. 

నాలుగవరోజు : డోలీ ప్రయాణం గౌరీకుండ్ నుండి ప్రారంభమై జంగల్చట్టి, భీంబలి, రాంబాడా, లించోలి మరియు రుద్ర పాయింట్ మీదుగా కేదార్ నాథ్ ధామ్ కు చేరుకుంటుంది. 

ఐదవరోజు : కేదార్ నాథ్ ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుంది. కేదార్ నాథ్ఆలయ ప్రాంగణాన్ని తెల్లవారుజామున యాత్రికుల కోసం తెరుస్తారు. ఉదయం 8.00 గంటలకు వేదమంత్రాలు మరియు ఆచారాల మధ్య ఈ ప్రారంభోత్సవం అంగరంగవైభవంగా జరుగుతుంది. 

కేదార్‌నాథ్ ఆలయ వేళలు

కేదార్‌నాథ్
ఆలయం తెల్లవారుజామున 4.00 కు తెరుచుకుని, నుంచి 7.00 గంటల వరకూ హారతి సమయం
ఉంటుంది. సాధారణ దర్శనం 7.00 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఉంటుంది. మధ్యాహ్నం
3 గంటల నుంచి 5 గంటల వరకూ ఆలయం మూసివేయబడుతుంది. తిరిగి 6 గంటలకు తెరిచి 7.30 గంటల
వరకూ  సంధ్యాహారతి నిర్వహించబడుతుంది.5
గంటల నుంచి 7 గంటల వరకూ సాధారణ దర్శనాలు కొనసాగుతూ ఉంటాయి. 

అయితే ఈ ఆలయం ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. అంచనాప్రకారం అక్టోబరు చివరి లేదా నవంబరు ప్రారంభంలో మూసివేయడం జరుగుతుంది. భారీహిమపాతం కారణంగా శీతాకాలంలో మూసివేయబడుతుంది. మూసివేసిన తరువాత కేదారేశ్వరుని విగ్రహాన్ని ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర ఆలయానికి తరలిస్తారు. అక్కడే శీతాకాల పూజలు కొనసాగుతాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *