మార్చి 18న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు

సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 18వ తేదీ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 5.00 గంటలకు సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామ అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 3.00 నుండి 4.00 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.

సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 8.00 నుండి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఆర్జితసేవలైన కుంకుమార్చన, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *