
బంగారు ఆభరణాల విరాళం : తిరుమల శ్రీవారి చరిత్రలో చారిత్రాత్మక విరాళంగా నిలిచేలా చెన్నైకి చెందిన జైన్ దంపతులు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి సమర్పించారు.
అనంతరం దాత కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు తలపై ఆభరణాల పళ్లాలను ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, శ్రీవారి సన్నిధికి చేరుకుని ఆభరణాలను స్వామివారి ఎదుట సమర్పించి పూజలు చేశారు.
బంగారు ఆభరణాల వివరాలు
- మొత్తం బంగారం: 121 కిలోలు (24 క్యారెట్లు)
- మొత్తం ఆభరణాలు: 46
- ఆభరణాల రకాలు: 33
- ఆభరణాల తయారీ ఖర్చులతో కలిపి మొత్తం విలువ: రూ.206 కోట్లు
- శ్రీవారి ఆభరణాలకు వినియోగించిన బంగారం: 106 కిలోలు (24 క్యారెట్లు)
- మిగిలిన 15 కిలోల బంగారంతో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి స్వర్ణ వస్త్రం తయారు చేయనున్నారు.
బంగారు ఆభరణాల లో విలువైన రాళ్ల వివరాలు
- వజ్రాల మొత్తం బరువు: 238.2 క్యారెట్లు
- నీలమణులు: 2,247.7 క్యారెట్లు
- పసుపు నీలమణులు: 91.6 క్యారెట్లు
- కెంపులు, పచ్చలు 84.2 క్యారెట్లు
- సాలగ్రామ రాళ్లు : 2,916.5 గ్రాములు.
33 రకాల బంగారు ఆభరణాల వివరాలు
- 1. పాద కవచములు – 2
- 2. అందెలు – 2
- 3. పాగడ – 1
- 4. తులసిపత్ర హారము – 1
- 5. అష్టోత్తర శత కాసుల మాల – 1
- 6. చతుర్భుజ లక్ష్మీ హారము – 1
- 7. పులిగోరు – 1
- 8. అష్టోత్తర పత్ర హారము – 1
- 9. సాదా వడ్డాణము – 1
- 10. గంటల మొలత్రాడు – 1
- 11. సూర్య కంఠి – 1
- 12. కౌస్తుభం – 1
- 13. శ్రీవత్సం – 1
- 14. మొలచేయి – 1
- 15. కటి హస్తము పై రేకు – 1
- 16. నాగాభరణ వడ్డాణము – 1
- 17. గొలుసు – 1
- 18. అభయ చేతుల కంకణాలు – 5
- 19. చంద్ర వంక కంఠి – 1
- 20. వైకుంఠ హస్తము – 1
- 21. కటి హస్తము – 1
- 22. నాగాభరణ కడియములు – 2
- 23. నాగాభరణములు – 2
- 24. భుజకీర్తులు – 2
- 25. కర్ణ పత్రములు – 2
- 26. బాహువులు – 2
- 27. శాలిగ్రామ హారము – 2 (2 భాగాలు)
- 28. కమలం త్రపు శాలిగ్రామ హారములు – 2 (2 భాగాలు)
- 29. నీమ కవచముల మోపుగల యజ్ఞోపవీతం – 1
- 30. శంఖము కవచము – 1
- 31. చక్రము కవచము – 1
- 32. ముక్కుపుడి – 1
- 33. కిరీటము – 1

