చిన్నశేష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం

 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో  భాగంగా రెండో రోజైన బుధవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా సాగింది.

చిన్న‌శేష వాహనం – కుటుంబ శ్రేయస్సు

చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *