సరస్వతిదేవి అలంకారంలో హంస వాహనంపై మలయప్పస్వామి

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు సరస్వతిదేవి అలంకారంలో జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. 
అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.
కాగా, బ్రహ్మూెత్సవాలలో మూడవరోజైన సోమవారం ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు సింహవాహనం, రాత్రి 9.00 నుండి 11.00 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు ఊరేగనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *