కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

శ్రీరామనవమిని పురస్కరించుకుని  మార్చి 17 నుండి 25వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా మార్చి 16న అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

మార్చి 19న ఉగాది ఆస్థానం, మార్చి 27 నుండి 29వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, మార్చి 30 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *