సర్వభూపాలవాహనం సేవతో భక్తిభావంతో పరవశించిన తిరుమల మాడ వీధులు
సర్వభూపాలవాహనం: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు నాలుగు మాడ వీధుల్లో వైభవంగా విహరించి భక్తులను అనుగ్రహించారు.
సర్వభూపాలవాహనం తో గజరాజుల ముందు నడక.. మంగళవాయిద్యాల నడుమ వైభవం
సర్వభూపాలవాహనం వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తబృందాల చెక్కభజనలు, జీయ్యంగార్ల గోష్టి, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ అంగరంగ వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.
సర్వభూపాలవాహనం సేవలో విశేష ఆధ్యాత్మిక సందేశం
సర్వభూపాల అంటే సమస్త రాజులు అని అర్థం. అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, పరమేశ్వరుడు లోకాలను పరిరక్షించే శక్తులకు ప్రతీకలుగా నిలుస్తారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై మోస్తూ సేవించడం ఈ వాహనసేవ ప్రత్యేకత.
ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలిస్తూ, భగవంతుని ఆశీస్సులతో లోకక్షేమానికి కృషి చేయాలనే సందేశాన్ని సర్వభూపాల వాహనసేవ చాటిచెబుతుంది.
శుక్రవారం ఉదయం మోహినీ అవతారం.. రాత్రి గరుడసేవ
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మోహినీ అవతారంలో, రాత్రి గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.


