శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం

    

    తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

    ఈ సందర్భంగా సాయంత్రం 4 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆస్థానం నిర్వహించారు.  స్వామివారి వేటను తిలకించడానికి పారువేట మండపానికి విశేష సంఖ్య‌లో భక్తులు విచ్చేసారు. తిరిగి నగరవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను సాయంత్రం 6.30 గంటలకు ఆలయానికి తీసుకువచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *