శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా కృత్తికా దీపోత్సవం

తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం  సాయంత్రం కృత్తికా దీపోత్సవం నిర్వహించారు. 

భక్తుల శివనామ స్మరణ-“హర హర మహాదేవ శంభో శంకర” అనే మంత్రోచ్ఛారణల మధ్య “కార్తీక దీపోత్సవం” అత్యంత భక్తి పారవశ్యంతో జరిగింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతం వేగం కూడా పెరిగింది. దీంతో ఆలయంలోని పుష్కరిణిలోనికి భక్తులను అనుమతించరు. ఆలయ ప్రాంగణంలో మహిళలు నెయ్యి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.

సాయంత్రం 6 గంటలకు గర్భాలయంలో, ఆ తరువాత శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయ గోపురం, శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయ గోపురం, ధ్వజస్తంభంపైన దీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఊంజల్‌ మండపంలో ఆకట్టుకునేలా శివలింగం, శూలం ఆకృతిలో ప్రమిదలు వెలిగించారు. ఆ త‌రువాత‌ జ్వోలాతోరణం వెలిగించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *