శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

 

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి.

ఇందులో భాగంగా ఉదయం యాగశాలపూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, మూలవర్లకు కలశాభిషేకం, పట్టుపవిత్ర సమర్పణ చేపట్టారు.

సాయంత్రం పంచమూర్తులైన శ్రీసోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివారి వీధి ఉత్సవం ఘనంగా నిర్వ‌హించారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *