శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కార్తీక వనభోజనాలు

 

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధ‌వారం కార్తీక వనభోజనాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం, ఆనంతరం ఆస్థానం నిర్వహించారు.

ఈ సందర్భంగా టిటిడి ఏర్పాటు చేసిన వన భోజనంలో వివిధ రకాల రుచికరమైన వంటకాలను భక్తులకు వడ్డించారు. శ్రీవారి వనభోజనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *