శివరాత్రినాడు పరమేశ్వరుని ఆరాధించండిలా…

శివుడు అంటే మంగళకరమైన వాడు అని అర్థం. శివరాత్రి అంటే శుభప్రదమైన రాత్రి అని చెబుతారు. పరమశివుడు జ్యోతిర్లింగ రూపునిగా ఆవిర్భవించిన పరమ పవిత్రదినం మహాశివరాత్రి. పరమేశ్వరుడు ఆనంద తాండవం చేసే రాత్రే శివరాత్రి. అందుకే ఈరోజున రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేయాలని పురాణాలు చెబుతున్నాయి.

సంవత్సరంలో ఎప్పుడూ శివుని తలవని వారు కూడా ఈ ఒక్కరోజు శ్రద్ధాభక్తులతో పరమేశ్వరుని అర్చిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుందంటారు పెద్దలు. అందుకే ‘జన్మానికో శివరాత్రి’ అనే సామెత పుట్టింది. మహాశివరాత్రి నాడు మనం శివుని ఎలా అర్చించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం….

https://www.youtube.com/watch?v=MSWtGZCFKK0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *