రథసప్తమికి తిరుమలలో జరిగే వాహనసేవల వివరాలు

సూర్యజయంతి రథసప్తమిని పురస్కరించుకుని జనవరి 24వ తేదీ బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అందుకే  ‘రథసప్తమి’ని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలని కూడా వ్యవహరిస్తారు.

ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆ రోజున  ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. అంతేకాక ఉదయం విఐపి బ్రేక్‌ దర్శనాలు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు, దాతలకు, మిలటరీ, యన్‌.ఆర్‌.ఐలకు సుపథం మార్గంలో కల్పించబడే ప్రత్యేక దర్శనాలను కూడా టిటిడి రద్దు చేసింది.

రథసప్తమి రోజున తిరుమలలో జరిగే వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయి.

సమయం-వాహనం

  • ఉ. 5.30 – ఉ. 08.00 సూర్యప్రభ వాహనం

(సూర్యోదయం ముహూర్తం ఉ. 6.45 గంటలుగా నిర్దేశించడమైనది)

  • ఉ. 9.00 – ఉ. 10.00 చిన్నశేష వాహనం
  • ఉ. 11.00 – మ. 12.00 గరుడ వాహనం
  • మ. 1.00 – మ. 2.00 హనుమంత వాహనం
  • మ. 2.00 – మ. 3.00 చక్రస్నానం
  • సా. 4.00 – సా. 5.00 కల్పవృక్ష వాహనం
  • సా. 6.00 – సా. 7.00 సర్వభూపాల వాహనం
  • రా. 8.00 – రా. 9.00 చంద్రప్రభ వాహనం

కాగా ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆరోజు నిర్వహించే ఆర్జితసేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *