మే 10, 11వ తేదీలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295వ జయంతి ఉత్సవాలు

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295వ జయంతి ఉత్సవాలను మే 10, 11వ తేదీల్లో తిరుపతి, తరిగొండలో వైభవంగా నిర్వహిస్తున్నారు.

తిరుప‌తిలో…

మే 10, 11వ తేదీల్లో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు సాహితి సదస్సు నిర్వ‌హిస్తున్నారు.  సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

మే 11వ తేది ఉదయం 9 గంటలకు తిరుపతి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు.

తరిగొండలో…

మే 11వ తేది తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, ఆలయ ప్రాంగణంలో శ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ‌కు పుష్పాంజలి, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులతో గోష్టి గానం, హరికథ నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *