పెద్ద‌శేష వాహ‌నంపై శ్రీ‌రాముడి అభ‌యం

తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల్లో మొద‌టిరోజు శుక్ర‌వారం రాత్రి శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ‌రామ‌చంద్రుడు పెద్ద‌శేష‌వాహ‌నంపై భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా,ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవ‌త‌రించాడు.

lord srirama

శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు, భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *