తిరుమల శ్రీవారికి అలంకరించేందుకు శ్రీవిల్లిపుత్తూరు మాలలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయంగార్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడవీధుల గుండా ఊరేగింపుగా గోదాదేవిమాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.  శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.

గోదాదేవి మాలల ప్రత్యేకత

శ్రీవిల్లిపుత్తూరు లోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేదని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించడం జరిగింది. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారము.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *