తిరుమల, తిరుపతి స్థానిక కోటా దర్శనాల్లో మార్పు

ప్రతినెలా మొదటి మంగళవారం తిరుమల, తిరుపతి స్థానికులకు టీటీడీ కల్పిస్తున్న స్థానిక కోటా దర్శనాల్లో ఈనెల స్వల్ప మార్పు చేయడమైనది.

ఈనెల మొదటి మంగళవారమైన 4వ తేది రథసప్తమి పర్వదినం రావడంతో భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో మంగళవారమైన 11వ తేదికి స్థానిక కోటా దర్శనాలను మార్పు చేయడమైనది.

ఈ మేరకు తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతిలోని మహతీ ఆడిటోరియంలో 9వ తేది ఆదివారం టోకెన్లను జారీ చేయనున్నారు.

స్థానికులు ఈ మార్పును గమనించి టోకెన్లు పొందాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *