
తిరుపతి లోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజా, హోమ మహోత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి అమ్మవారి చండీయాగం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు ఈ యాగ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో విశేష పూజలు, నిత్యహోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహించనున్నారు.
భక్తులు రూ.500 టికెట్‌తో ఒకరోజు హోమంలో గృహస్తులుగా పాల్గొనే అవకాశం కల్పించారు. పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు.

