తిరుచానూరులో ఏప్రిల్‌ నెలలో విశేష ఉత్సవాలు

 

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

•⁠ ⁠ఏప్రిల్‌ 4, 11, 18, 25వ తేదీల‌లో శుక్ర‌వారం సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం నిర్వ‌హించ‌నున్నారు.

•⁠ ⁠ఏప్రిల్‌ 21న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంట‌లకు ఆల‌య మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.

శ్రీ బ‌ల‌రామ‌కృష్ణ స్వామి ఆలయంలో..

ఏప్రిల్ 3, 30వ తేదీల‌లో రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగ‌నుంది.

శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో..

ఏప్రిల్ 12న హ‌స్త న‌క్ష‌త్రం సంద‌ర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంట‌ల‌కు తిరుచ్చి ఉత్సవం నిర్వ‌హించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *