జూలై 31, ఆగస్టు 1వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 200వ వర్ధంతి ఉత్సవాలు

శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాత శ్రీ తరిగొండ వెంగమాంబ 200వ వర్ధంతి ఉత్సవాలు జూలై 31, ఆగస్టు 1వ తేదీల్లో తరిగొండ, తిరుపతి, తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి.
వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీన సింహస్వామివారి ఆలయంలో జూలై 31వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 1న సాయంత్రం 6.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీ లక్ష్మీన సింహస్వామివారికి కళ్యాణోత్సవం, రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జూలై 31వ తేదీన ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు సాంస్క తిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 1న ఉదయం 11.30 గంటలకు తిరుపతిలోని ఎంఆర్‌.పల్లి సర్కిల్‌ వద్దగల తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య కళామందిరంలో ప్రముఖ కళాకారులతో సాంస్క తిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆగస్టు ఒకటో తేదీ ఉదయం 9.00 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బ ందావనంలో తితిదే అధికారులు పుష్పాంజలి సమర్పిస్తారు.
తరిగొండ వెంగమాంబ క్రీ.శ 1730వ సంవత్సరంలో చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపంలోని తరిగొండ గ్రామంలో కానాల మంగమాంబ, కానాల క ష్ణయామాత్యులు దంపతులకు జన్మించారు. శ్రీ వేంకటేశ్వరుని దయవల్ల కలిగిన సంతానం కావున ఈమెకు ‘వెంగమాంబ’ అని పేరు పెట్టారు. ఈమెకు పదేళ్ల వయసులోనే ఇంజేటి వేంకటాచలపతితో బాల్య వివాహం జరిగింది. వివాహమైన కొన్నాళ్లకే భర్త వియోగం ఏర్పడింది. అయినా శ్రీవేంకటేశ్వరుడే తన భర్త అని ప్రకటించి వెంగమాంబ ముత్తయిదువు చిహ్నాలు ధరించి ఉండేవారు.
మదనపల్లికి చెందిన రూపావతారం సుబ్రహ్మణ్యయోగి వద్ద ఆధ్యాత్మిక విద్య, యోగవిద్య ఉపదేశం పొందారు. కొద్దికాలానికే ఆ విద్యల్లో ఎంతో అనుభవం సాధించారు. ఆధ్యాత్మిక, భక్తి, యోగ విషయాలకు సంబంధించి తరిగొండలో 5, తిరుమలలో 13 పుస్తకాలు రాశారు. ఇందులో యక్షగానాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పద్యరచనలు, ద్విపదరచనలు ఉన్నాయి.
వెంగమాంబ తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంతసేవలో ”ముత్యాలహారతి” అనే విశిష్ట నిత్యకైంకర్యాన్ని నెలకొల్పారు. ఈ సేవ నేటికీ అవిచ్ఛిన్నంగా జరుగుతూనే ఉంది. తాళ్లపాక అన్నమాచార్యుల వారిని ప్రస్తుతించిన ఏకైక కవయిత్రి వెంగమాంబ కావడం విశేషం. క్రీ.శ. 1817వ సంవత్సరంలో తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరున్ని స్మరిస్తూ వెంగమాంబ సజీవసమాధి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *