జనవరి 31న చంద్రగ్రహణం ఉదయం 9.30 గం||ల నుంచి రాత్రి 9.30 గం||ల వరకు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం మూత

చంద్రగ్రహణం కారణంగా జనవరి 31వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం తలుపులు మూసివేస్తారు.

జనవరి 31న సాయంత్రం 5.53 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, రాత్రి 9.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, రాత్రి కైంకర్యాలు, ఏకాంతసేవ నిర్వహిస్తారు.

చంద్రగ్రహణం కారణంగా జనవరి 31న ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఫిబ్రవరి 1వ తేదీ తిరుప్పావడ సేవలను టిటిడి రద్దు చేసింది.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *