అలిపిరి పాదాల వద్ద ఘన౦గా మెట్లపూజ

మోక్షానికి అవసరమై న జ్ఞానాన్ని ప్రసాది౦చే మహత్తరమైన కార్యక్రమ౦ శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమం తిరుపతిలో వైభవ౦గా నిర్వహి౦చారు. దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహంతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో శ్రీవారి మెట్లోత్సవం నిర్విఘ్న౦గా కొనసాగుతో౦ది. మానవులు జ్ఞాన పూర్వకంగా, శ్రద్ధతో, యోగ్యతానుసారంగా పని చేయాలని, శ్రేయో మార్గమైన ఇలాంటి అంశాలను అలవరుచుకుంటే జీవనం సుఖమయం అవుతుందని వివ‌రించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుకు చెందిన 3,500 మంది భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్య‌ులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *