అప్పలాయగుంటలో బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు

అప్పలాయగుంటలో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 5, 6 తేదీల్లో బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగనుంది. ఆగస్టు 4వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహిస్తారు.

ఆగస్టు 5న ఉదయం వాస్తుశుద్ధి, జలాధివాస శుద్ధి చేస్తారు. సాయంత్రం మహాశాంతి జప్యం, మహాశాంతి తిరుమంజనం, రక్షాబంధనం, శయనాధివాసం, సర్వదేవతార్చన నిర్వహిస్తారు. ఆగస్టు 6న ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, ఆ తరువాత కుంభ బింబ ప్రదక్షిణ, అక్షతారోపణ, బ్రహ్మ ఘోష చేపడతారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *