దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు

 

వైఎస్సార్‌ కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 10 నుండి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఆలయ పుష్కరిణిలో మూడు రోజుల పాటు సాయంత్రం వేళ తెప్పలపై విహరించనున్నారు. స్వామి, అమ్మవారు మొదటి రోజు మూడు చుట్లు, రెండో రోజు ఐదు చుట్లు, చివరి రోజు ఏడు చుట్లు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *