మహాకుంభమేళకు టిటిడి తరుపున నమూనా ఆలయం

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ )లో జరుగనున్న మహాకుంభమేళకు టిటిడి తరుపున నమూనా ఆలయ నిర్మాణం చేపడుతున్నారు.

    ప్రయాగ్ రాజ్ (అలహాబాద్ )లో జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు మహాకుంభ మేళలో జరుగనున్న నేపథ్యంలో టిటిడి ఆదేశాలతో తిరుమల స్వామివారి ఆలయంలో జరుగుతున్న కైంకర్యాలకు అవసరమైన ఏర్పాట్లు  చేస్తున్నారు.

    12 సంవత్సరాలకోసారి పుష్కారాలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఏడాది మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్ లో జరుగుతోంది. అలాంటి పవిత్ర పుణ్య స్థలంలో స్వామి వారి నమునా ఆలయం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మరింత ఆధ్యాత్మికతను పెంచేందుకు టిటిడి పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. 

    ప్రయాగ్ రాజ్ కు విచ్చేసే అశేష భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం టిటిడి కల్పిస్తోంది. జనవరి 12 వ తేదిన స్వామివారికి సంప్రోక్షణ చేసి, అచల ప్రతిష్ట తదితర కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులకు పవిత్రతతో 13వ తేది నుంచి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు వీక్షించే అవకాశం కల్పించనున్నారు. 

    మహాకుంభమేళ అంటేనే కొన్ని సంవత్సరాపాటు తపస్సు చేస్తున్న మునులు, సాధువులు పవిత్ర గంగాజలంలో స్నానం ఆచరించి పుణ్యం పొందేందుకు వస్తారు. అంతటి పవిత్రమైన స్థలంలో ఏర్పాటుచేస్తున్న వెంకటేశ్వరస్వామి ఆలయ స్థల శుద్ది కోసం జనవరి 12 వ తేదిన  వాస్తు హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *