కపిలేశ్వరస్వామి : వైభవంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి అన్నాభిషేకం

కపిలేశ్వరస్వామి : అన్నంతో అలంకరించిన శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు

కపిలేశ్వరస్వామి :  తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం అన్నాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నంతో అలంకరించిన పరమశివుని దర్శించుకునే పవిత్ర అవకాశం భక్తులకు కల్పించారు.

కపిలేశ్వరస్వామి కి శాస్త్రోక్తంగా అభిషేకాది కార్యక్రమాలు

ఈ సందర్భంగా ఉదయం ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, అన్నాభిషేకం, దీపారాధన నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు.

దర్శనం అనంతరం ఏకాంతంగా ఉద్వాసన కార్యక్రమం నిర్వహించి, అన్నప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం ఆలయ శుద్ధి చేపట్టి, సాయంత్రం సుగంధద్రవ్య అభిషేకం నిర్వహించి, అదే సమయంలో భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు.