
నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరియమాణిక్యస్వామి, శ్రీ నీలకంఠేశ్వరస్వామి Sri Neelakantheswara Swamy వారి ఆలయంలో అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు దేవి నవరాత్రి ఉత్సవాలను టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నారు.
శ్రీ నీలకంఠేశ్వరస్వామి Sri Neelakantheswara Swamy ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా పది రోజులపాటు అమ్మవారు వివిధ దివ్య అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చి, భక్తులపై కరుణాకటాక్షాలు ప్రసరించనున్నారు.
అక్టోబరు 11న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
Sri Neelakantheswara Swamy ఆలయంలో అమ్మవారి అలంకారాల వివరాలు:
- అక్టోబరు 11 – శ్రీ పార్వతీదేవి
- అక్టోబరు 12 – శ్రీ బాలా త్రిపురసుందరి
- అక్టోబరు 13 – శ్రీ లలితా త్రిపురసుందరి
- అక్టోబరు 14 – శ్రీ మహాలక్ష్మీదేవి
- అక్టోబరు 15 – శ్రీ అన్నపూర్ణాదేవి
- అక్టోబరు 16 – శ్రీ గాయత్రీదేవి
- అక్టోబరు 17 – శ్రీ సరస్వతీదేవి
- అక్టోబరు 18 – శ్రీ దుర్గాదేవి
- అక్టోబరు 19 – శ్రీ మహిషాసురమర్ధిని
- అక్టోబరు 20 – శ్రీ రాజరాజేశ్వరీదేవి
ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకం, ఆస్థానం, సాయంత్రం లలితా సహస్రనామార్చన, కుంకుమ పూజ, పంచహారతి నిర్వహించనున్నారు.
శ్రీ నీలకంఠేశ్వరస్వామి Sri Neelakantheswara Swamy ఆలయంలో దేవీ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు అత్యంత పవిత్రమైన సందర్భమని, ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దివ్య అలంకారాల్లో కొలువుదీరే అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని, అమ్మవారి కృపాకటాక్షాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.

