వేంకటేశ్వరుని హారతి పాట

నిత్యం ఈ హారతి పాటలో భగవాన్ వేంకటేశ్వరుని స్తుతించండి, ఆరాధించండి మీకు అంతా శుభం కలుగుతుంది.

వెంకటేశ్వరస్వామి హారతి పాట

హారతి గొనరా శ్రీశ్రీసా వేగమె రారా శ్రీనివాసా

రంగు మీరగా భక్తులము,పసిడి పళ్ళెరము తోనిచ్చే 

మంగతొ గూడి సుందర మూర్తి మగువల హారతి గైకొనవోయ్

నీవు మంగతొ గూడి సుందర మూర్తి మగువల హారతి గైకొనవోయ్ 

హారతి గొనరా శ్రీశ్రీసా వేగమె రారా శ్రీనివాసా

1.పాప పంకిలము ఈ జగతి భవజాలమనే జాలములో 

పాప పంకిలము ఈ జగతి భవజాలమనే జాలములో 

నే చిక్కితినయ్యా శ్రీరమణయ్య భక్తుల బ్రోవగ నీవేనయా

నే చిక్కితినయ్యా శ్రీరమణయ్య భక్తుల బ్రోవగ నీవేనయా

హారతి గొనరా శ్రీశ్రీసా వేగమె రారా శ్రీనివాసా

2. నీదు చరణములె నమ్మితినీ శరణను వేడగ రాలేవా 

నీదు చరణములె నమ్మితినీ శరణను వేడగ రాలేవా 

దయారాదా ఓ తిరుపతి వాసా దరిశనమీయగ తరుణమిదే

దయారాదా ఓ తిరుపతి వాసా దరిశనమీయగ తరుణమిదే

హారతి గొనరా శ్రీశ్రీసా వేగమె రారా శ్రీనివాసా

3.పుత్రులు వారూ బంధువులా ఆప్తులు అంతా రక్షకులా

పుత్రులు వారూ బంధువులా ఆప్తులు అంతా రక్షకులా

రక్షణసాయ ముక్తిని ఈయ భక్తుల బ్రోవగ నీవేనయా 

రక్షణసాయ ముక్తిని ఈయ భక్తుల బ్రోవగ నీవేనయా 

హారతి గొనరా శ్రీశ్రీసా వేగమె రారా శ్రీనివాసా

హారతి గొనరా శ్రీశ్రీసా వేగమె రారా శ్రీనివాసా 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *