కాణిపాకం సెప్టెంబరు 13 నుంచి వినాయకుని బ్రహ్మోత్సవాలు

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను సెప్టెంబరు 13 నుంచి అక్టోబరు 3 వరకూ నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా వినాయకచవితి మొదలుకుని మొత్తం 11 రోజులపాటు బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలతో పాటు ఆ విఘ్ననాయకునికి ప్రత్యేక ఉత్సవాలు కూడా కాణిపాకం ఆలయంలో వైభవోపేతంగా నిర్వహిస్తారు.

కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు జరిగే తేదీలు

  • 13న వినాయకచవితి
  • 14న ఉదయం ధ్వజారోహణం, రాత్రి హంసవాహనం
  • 15న నెమలి వాహనం
  • 16న మూషిక వాహనం
  • 17న శేష వాహనం
  • 18 న వృషభవాహనం
  • 19న గజవాహనం
  • 20న రథోత్సవం
  • 21న తిరుకళ్యాణం,
  • 22న ధ్వజావరోహణం, వడాయత్తు ఉత్సవం, ఏకాంతసేవ

స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఏకాంతసేవతో ముగుస్తాయి.

సెప్టెంబరు 23 న నందివాహనం మొదలుకొని అక్టోబరు 3 న తెప్పోత్సవా వరకూ 11 రోజుల పాటు స్వామివారికి వైభవంగా ప్రత్యేక ఉత్సవాలు కూడా కన్నులపండువగా జరుగుతాయి.

కాణిపాకంలో ప్రత్యేక ఉత్సవాల వివరాలు

  • 23న అధికార నందివాహనం
  • 24న రావణబ్రహ్మ వాహనం,
  • 25న యాళి వాహనం
  • 26న సూర్యప్రభ వాహనం
  • 27 చంద్రప్రభ వాహనం
  • 28 న విమానోత్సవం
  • 29న పుష్పపల్లకీ సేవ,
  • 30న కామధేను వాహనం, అక్టోంబరు 1న కల్పవృక్ష వాహనం,
  • 2న పూలంగిసేవ,
  • 3న తెప్పోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *