టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 27 నుండి జూన్ 5వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 22న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 26న అంకురార్పణం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
తేదీ ఉదయం సాయంత్రం
- 27-05-18(ఆదివారం) ధ్వజారోహణం శేష వాహనం
- 28-05-18(సోమవారం) తిరుచ్చి ఉత్సవం హనుమంత వాహనం
- 29-05-18(మంగళవారం) ద్వార దర్శనం గరుడసేవ
- 30-05-18(బుధవారం) తిరుచ్చి ఉత్సవం హంస వాహనం
- 31-05-18(గురువారం) తిరుచ్చి ఉత్సవం విమాన వాహనం
- 01-06-18(శుక్రవారం) తిరుచ్చి ఉత్సవం సింహవాహనం, గజవాహనం, స్వామివారి కల్యాణం.
- 02-06-18(శనివారం) రథోత్సవం తిరుచ్చి ఉత్సవం
- 03-06-18(ఆదివారం) తిరుచ్చి ఉత్సవం పార్వేట ఉత్సవం
- 04-06-18(సోమవారం) చక్రస్నానం ధ్వజావరోహణం
- 05-06-18(మంగళవారం) అభిషేకం పుష్పయాగం
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 1వ తేదీ రాత్రి 9 నుండి 10 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

