ఘనంగా పాలిమర్‌ పీఠాధిపతి పర్యాయ ఉత్సవం

కర్ణాటక రాష్ట్రం ఉడిపిలోని శ్రీ పాలిమర్‌ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థస్వామివారి పర్యాయ ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో టిటిడి ఈవో  అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు  పాల్గొన్నారు. టిటిడి తరఫున శ్రీవారి ప్రసాదాలను స్వామీజీకి అందించారు.

రెండోసారి పీఠాన్ని అధిష్టించిన శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థస్వామి

ఉడిపిలో 800 ఏళ్లనాటి పురాతన ప్రాశస్త్యం గల శ్రీకృష్ణస్వామివారి ఆలయం ఉంది. ద్వైత సంప్రదాయాన్ని పాటిస్తున్న అష్ట మఠాల పీఠాధిపతులు ఒక్కొక్కరు రెండేళ్ల చొప్పున ఈ ఆలయ నిర్వహణతోపాటు పూజాకైంకర్యాల బాధ్యతను నిర్వహిస్తారు. ఈ బాధ్యతలను స్వీకరించే కార్యక్రమాన్ని ”పర్యాయ ఉత్సవం”గా వ్యవహరిస్తారు. దీనిని ”సర్వజ్ఞ ఉత్సవం” అని కూడా అంటారు. పెజావర్‌ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విశ్వేశతీర్థస్వామివారి నుంచి శ్రీశ్రీశ్రీ విద్యాధీశతీర్థ స్వామివారు బాధ్యతలు స్వీకరించారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *