ఒంటిమిట్ట అభివృద్ధిపై పలు ప్రణాళికలు

 

 
 ఒంటిమిట్టను ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మార్చేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించడానికి  టీటీడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ సీతారామ కళ్యాణం విజయవంతంగా నిర్వహించిన అనంతరం ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధి, యాత్రికుల సౌకర్యాలపై సమీక్ష జరిగింది.

ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు తగినవిధంగా సౌకర్యాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉండడంతో  ఒంటిమిట్ట క్షేత్రం అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. 

 సమీక్షలో ముఖ్యాంశాలు

•⁠ ⁠తిరుపతి కాణిపాకం- తాళ్లపాక , గండికోట (నైట్ హాల్ట్) – ఒంటిమిట్ట మరియు శ్రీ కాళహస్తి, సర్క్యూట్‌లను 2 రోజుల/3 రోజుల పర్యటనతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయడం. 

•⁠ ⁠ఒంటిమిట్ట చెరువును సుందరీకరించి, బోటింగ్ సౌకర్యంతో మధ్యలో జాంబవంతుని విగ్రహం ఏర్పాటు .

•⁠ ⁠టీటీడీ, దాతలు, ప్రయివేట్ ఆపరేటర్ల ద్వారా ఒంటిమిట్టలో వసతి మెరుగుకు ప్రణాళిక రూపొందించడం. మిగిలిన ఆలయ పునరుద్ధరణ పనులన్నీ ASI సహాయంతో చేపట్టడం. 

•⁠ ⁠రామతీర్థం, లక్ష్మణ తీర్థం తీర్థాల యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ అభివృద్ధి.

•⁠ ⁠రామాయణం, హిందూత్వ విలువలను తెలిపే విధంగా పోతనగిరి పై శ్రీరామ ప్రాజెక్టు.

•⁠ ⁠ఒంటిమిట్టలో భక్తులందరికీ నిత్యాన్నదానం ప్రారంభించేందుకు అన్నప్రసాద భవనం నిర్మాణం.

•⁠ ⁠ఒంటిమిట్టను ఆధ్యాత్మిక క్షేత్రంగా, మతపరమైన టూరిజం సర్క్యూట్‌లో భాగంగా చేయడానికి ఆలయం, పరిసర ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని మెరుగుపరచడానికి, యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఒక బృహత్తర ప్రణాళిక తయారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *