శ్రీవారిని దర్శించుకున్న శ్రీ వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ

కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ ద్వైత సంస్థానంగా పేరుగాంచిన శ్రీ వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

స్వామిజీ ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఇస్తికఫాల్‌ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

శ్రీ వ్యాసరాజ మఠానికి 41వ మఠాధిపతిగా శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ కొనసాగుతున్నారు. 8 శతాబ్దాలకు పైగా చరిత్ర గల ఈ మఠం వ్యవస్థాపకులు శ్రీమద్‌ ఆనందతీర్థ భగవత్పాదులవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *