వైభవంగా శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి పుష్పయాగం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 14వ తేది బుధవారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది.

ఆలయంలో ఫిబ్రవరి 6 నుంచి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

pushpayaga mahotsavam

ఈ సందర్భంగా బుధవారం ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 10.30 నుండి 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, 5 రకాల ఆకులతో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు.

చామంతి , రోజాలు , గన్నేరు , సంపంగి , మల్లెలు , రుక్షి , కనకామ్రాలు , తామర , కలువ , మొగలిరేకులు , మాను సంపంగి పుష్పాలు, …తులసి, దవనం , మరవం , , బెల్వం , పన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారు. పుష్పయాగ అలంకరణలో శ్రీవారి సేవకులు , ఉద్యానవన సిబ్బంది పాల్గొన్నారు. పుష్పయాగానికి 3 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. తమిళనాడు నుంచి ఒకటిన్నర టన్ను , కర్నాటక నుంచి ఒక టన్ను , ఏపీ నుంచి 500 కేజీల పుష్పాలు విరాళంగా అందాయి. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహించారు.

రూ.516/- చెల్లించి పుష్పయాగంలో పాల్గొనే గృహస్తులకు(ఇద్దరు) రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేశారు. పుష్పయాగం కారణంగా మార్చి 14వ తేదీన అష్టోత్తర శతకలశాభిషేకం, ఆర్జిత కల్యాణోత్సవం సేవలను టిటిడి రద్దు చేసింది.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *