మే 11 నుండి 19వ తేదీ వరకు జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

జమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 11 నుండి 19వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 10వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 20వ తేదీన సాయంత్రం 6 గంట‌లకు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు

  • 11-05-2025: ఉదయం – ధ్వజారోహణం (ఉద‌యం 8.15 నుండి 9 గంట‌ల వ‌ర‌కు), రాత్రి – పెద్దశేష వాహనం
  • 12-05-2025: ఉదయం – చిన్నశేష వాహనం, రాత్రి – హంస వాహనం
  • 13-05-2025: ఉదయం – ముత్యపుపందిరి వాహనం, రాత్రి – సింహ వాహనం
  • 14-05-2025: ఉదయం – కల్పవృక్ష వాహనం,  రాత్రి – హనుమంత వాహనం
  • 15-05-2025: ఉదయం – పల్లకీ ఉత్సవం, రాత్రి – గరుడ వాహనం
  • 16-05-2025: ఉదయం – సర్వభూపాల వాహనం, రాత్రి – కల్యాణోత్సవం (సాయంత్రం 6 గంట‌ల‌కు),
  •     గజ వాహనం (రాత్రి 8 గంట‌ల‌కు)
  • 17-05-2025: ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వవాహనం
  • 18-05-2025: ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం
  • 19-05-2025: ఉదయం – చక్రస్నానం (ఉద‌యం 9 గంట‌ల‌కు), రాత్రి – ధ్వజావరోహణం

మే 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.300/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *