గజ వాహనం పై శ్రీనివాస ప్రభువు కనువిందు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మంగళవారం రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు వేంకటాద్రీశుడు గజవాహనం పై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చాడు.

రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహణం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి గజవాహనారూఢుడై తిరువీధులలో తిరగడం భక్తులకు మరపురాని దృశ్యం.

స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజే గాక, బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజూ వాహనసేవల సమయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. బ్రహ్మరథం వెనుక అశ్వాలు, వృషభాలతో ఠీవిగా ఈ గజాలు కూడా నడిచివస్తాయి.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *