అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు


అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 13 నుండి 15వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 12న సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం శాస్త్రోక్తంగా జరుగనుంది.





వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.





పవిత్రోత్సవాలు ఇలా…





  • సెప్టెంబ‌రు 13వ తేదీన పవిత్రప్రతిష్ఠ
  • సెప్టెంబరు 14న పవిత్ర సమర్పణ,
  • సెప్టెంబరు 15న మ‌హాపూర్ణాహుతి కార్యక్రమాలు




ఈ సంద‌ర్భంగా మూడు రోజుల పాటు ఉద‌‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్నవేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు.





కోవిడ్ – 19 నిబంధన‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.‌


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *