ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు

శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సెప్టెంబరు 7వ తేదీన గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు.

టీటీడీ హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలను తిరుపతిలో ప్రతి ఏడాదీ అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది.

శ్రీ కృష్ణగోళాన్ని తలపించే విధంగా టీటీడీ శ్రీవేంకటేశ్వర గోశాలలో ఏర్పాట్లను చేయనున్నారు. భారీగా పందిళ్ళు, మామిడితోరణాలు, పూలమాలలతో అలంకారాలు చేపట్టనుంది. గోశాలలోని గోసంపదను అందంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సందర్శకులు గోశాలలో బెల్లం, గోమాతలకు భక్తులు స్వయంగా బియ్యం తినిపించే   టీటీడీ కల్పిస్తోంది.

గోసేవ మహా పుణ్యప్రదం

గోవుకు మేతదానం చేస్తే మహాపుణ్యఫలమని భక్తుల నమ్మకం. కావున టీటీడీ సందర్శకులకు గోశాలలోని గోవులకు గ్రాసాన్ని అందించి గోమాత, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడం జరిగింది.

గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, ఉదయం 6 గంటలకు వేణుగానం, ఉదయం 7.30 గంటలకు వేద పఠనం, ఉదయం 7.30 గంటలకు దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులతో భజనలు, కోలాటాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.

సాయంత్రం 6 గంటలకు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *