జనవరి 16న తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం సంక్రాంతి కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు.





గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 9.00 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి మ‌ఠం నుండి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు.





ఆనంత‌రం మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు.





ఆర్జితసేవలు రద్దు





ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే తోమాలసేవ, అర్చన, స‌హ‌స్ర క‌ళాశాభిషేకం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, మరియు సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.





Source


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *