జూన్‌ 23 నుండి జూలై 1 వరకు అప్పలాయగుంటలో వార్షిక బ్రహ్మోత్సవాలు

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్‌ 19వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో జూన్‌ 23 నుండి జూలై 1వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 8.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు

తేదీ                                       ఉదయం                                  సాయంత్రం

  • 23-06-2018(శనివారం) ధ్వజారోహణం(మిధున లగ్నం) పెద్దశేష వాహనం
  • 24-06-2018(ఆదివారం) చిన్నశేష వాహనం హంస వాహనం
  • 25-06-2018(సోమవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
  • 26-06-2018(మంగళవారం)కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం
  • 27-06-2018(బుధవారం) మోహినీ అవతారం గరుడ వాహనం
  • 28-06-2018(గురువారం) హనుమంత వాహనం గజ వాహనం
  • 29-06-2018(శుక్రవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
  • 30-06-2018(శనివారం) రథోత్సవం అశ్వవాహనం
  • 1-07-2018(ఆదివారం) చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్‌ 26వ తేదీ సాయంత్రం 5.00 నుండి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *