వేడుక‌గా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి

 

తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి గురువారం వేడుక‌గా జ‌రిగింది. ప్రతిఏటా పుష్య మాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.

శ్రీవారి ఆలయం నుంచి అర్చ‌క సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 10 గంట‌లకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్క‌డ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణభగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చంద‌నం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం స‌మ‌ర్పించారు.

రామ‌కృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలుగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. అన్నప్రసాద వితరణ కూడా చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *