శ్రీ కపిలేశ్వరాలయంలో ఐదవ రోజు ఘనంగా రుద్రయాగం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) శుక్రవారం ఘనంగా జరిగింది. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం రుద్రజపం, హోమం, నివేదన, లఘు పూర్ణాహుతి, దీపారాధన నిర్వహించారు. సాయంత్రం 6.00 గంటల నుండి జపం, హోమం, రుద్రత్రిశతి, బిల్వార్చన, విశేషదీపారాధన నిర్వహించనున్నారు. 
రుద్రయాగం వెయ్యి రుద్రాభిషేకాల ఫలాన్ని ఇస్తుందని, ఇందులో పాల్గొన్న వారికి మృత్యుగండం, బాలారిష్టాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *