నవంబరు 14న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబరు 14వ తేదీ మంగళవారం ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించనున్నారు.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను శ్రీకృష్ణస్వామి ముఖ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు.
అదేరోజు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.1,116/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఐదు లడ్డూలు, ఐదు వడలు బహుమానంగా అందజేస్తారు. ఆలయం వద్దగల కౌంటర్‌లో కరంట్‌ బుకింగ్‌లో భక్తులు ఈ టికెట్లు పొందొచ్చు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *