గొబ్బిళ్ళ పాటలు-01: ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే

సంక్రాంతి సంబరం అంతా గొబ్బిళ్ల వేడుకలలోనే కనిపిస్తుంది. ఇంటిముందు రంగవల్లుల్లాంటి కొత్త బట్టలు ధరించిన ఆడపిల్లు సప్తవర్ణాలు అద్దిన రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలు ఉంచి వాటిని పూజించి అనంతరం గొబ్బిళ్ళ పాటలు పాడుతుంటే ఆ అందం ఆనందం మరొక సందర్భంలో రాదంటారు పెద్దలు.

కానీ మన సనాతన సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో మనం మర్చిపోతున్న గొబ్బెమ్మల పాటను మీకు గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా గొబ్బిపాటలను మీకు భక్తిసారం అందిస్తోంది. 

ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను
ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను
ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను
ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెను? 
ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెను?
కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు!!ఏల!!
కాళింది మడుగులోన దూకినాడమ్మా
బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మా!!ఏల!!
చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు 
చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు
ఆ పొన్న మాను పైన పెట్టి పంతమాడెనే!!ఏల!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *