కల్పవృక్ష వాహనంపై పాండురంగ స్వామి అలంకారంలో శ్రీ వేదనారాయణ స్వామి అనుగ్రహం

నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై పాండురంగ స్వామి అలంకారంలో స్వామివారు భక్తులను అనుగ్రహించారు.

వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

కల్పవృక్షం కోరుకున్న వరాలను ప్రసాదించే దివ్య వృక్షంగా పరిగణించబడుతుంది. దాని నీడలో ఆశ్రయించిన వారికి శాంతి, సంతృప్తి కలుగుతాయని ఆధ్యాత్మిక భావన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *