తెలుగు సంవత్సరంలో ఆరవ నెల. చాంద్రమానం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు పూర్వాబాధ్ర లేదా ఉత్తరాబాధ్ర నక్షత్రం ఉండడం వలన ఇది బాధ్రపద మాసం అనబడింది. ఇది వర్షఋతువు కాబట్టి విరివిగా వర్షాలు పడతాయి.
బాధ్రపద మాసం మనకు రెండు విషయాల్లో కీలకమైన మాసం. 1. వినాయకచవితి పర్వదినం వచ్చేది ఈ మాసంలోనే, 2. పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధుల వంటి కార్యక్రమాలు ఈ మాసంలో చేస్తారు దీనినే మాహాలయ పక్షం అంటాం. అంటే భాద్రపద మాసంలోని శుక్లపక్షం అంటే ఈ మాసంలోని పాడ్యమి తిధి మొదలు పౌర్ణమి వరకూ దేవతాపూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, పౌర్ణమి వెళ్లిన పాఢ్యమి నుంచి అమావాస్య వరకూ ఉండే కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా
గుర్తించాలన్నమాట…
వినాయక చవితి
వరాహ, వామనావతారాలు
రాాధాష్టమి
భాధ్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు చాలా ఉన్నాయి
హరితాళిక వ్రతం లేదా , సువర్ణగౌరీ వ్రతం
భాద్రపద శుక్ల పక్ష తదియనాడు ’ హరితాళిక వ్రతం’ లేదా ’ సువర్ణ గౌరీ వ్రతం ’ అంటే ’పదహారు కుడుముల తద్ది జరుపుకుంటారు. ఈ రోజున శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించాలని పెద్దలు చెబుతారు. ఈ పూజను కన్యలు ఆచరిస్తే వారికి మంచి భర్త లభిస్తాడు అలాగే ముత్తయిదువలు పాటించడంవల్ల వారికి సకల సౌభాగ్యాలు లభిస్తాయి.
ఉండ్రాళ్ళ తద్ది
భాద్రపద బహుళ తదియ నాడు అవివాహితలు చేసే వ్రతం ఉండ్రాళ్ళ తద్ది. తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతాపూజ చేసి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో వూగుతారు.
భాద్రపద మాసంలో పండుగలు
తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై శేషతల్పంమీద శయనించిన శ్రీమహావిష్ణువు ఈ మాసంలోని ఏకాదశినాడు మరొక ప్రక్కకు ఒత్తిగిల్లుతాడంటారు. అంటే పరివర్తన చెందుతాడన్నమాట… అందుకే ఈ రోజును ’పరివర్తన ఏకాదశి’ అని పిలుస్తాం, ’విష్ణు పరివర్తన ఏకాదశి’ అని ’పద్మ పరివర్తన ఏకాదశి’ అని పేరు కూడా ఉంది. ఈనాడు అందరూ వారి వారి ఇళ్ళల్లో ఈ ఏకాదశి వ్రతం నిష్టగా చేస్తే సమాజంలో కరువుకాటకాలు రావని, ఒకవేళ వచ్చి వుంటే వాటినుండి తక్షణం విముక్తి లభిస్తుందని పెద్దల ఉవాచ…
వామన జయంత
శుక్ల చతుర్డశి : అనంత చతుర్ధశి
కృష్ణ పక్ష ఏకాదశి : అజ ఏకాదశి
అజ ఏకాదశికే ’ధర్మప్రభ ఏకాదశి’ అని కూడా పేరు. పూర్వం గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, భార్యాకుమారులను పోగొట్టుకుని కాటికాపరిగా పని చేసిన హరిశ్చంద్రుడు వాటిని తిరిగి పొందినట్లు పురాణ కథనం.ఈ ఏకాదశినాడు వ్రతం ఆచరించడంతోపాటు నూనెగింజలు దానం చేయాలని శాస్త వచనం.
కన్యా సంక్రమణం
ఈ చరాచర జగత్తుకు వెలుగును , చైతన్యాన్ని ప్రసాదించే సూర్య భగవానుడు సింహరాశి నుండి రాశులలో ఆరవదైన కన్యారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాదు. ఈ రోజు పూజలు, దానాలు చేయడంతోపాటు సూర్యభగవానుడిని, శ్రీమహావిష్ణువును పూజించవలెను.
ఏకాన్న ఆహార వ్రతం చేస్తే ధనం – ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. బాధ్రపద శుక్ల తదియ నాడు జరుపుకునే హరితాళికా వ్రతం స్త్రీలకు పార్వతీ పరమేశ్వర పూజ, ఉపవాసం, జాగరణ చెప్పబడ్డాయి.
మహాలయ పక్షం
భాద్రపద మాసంలో విశేషమైన రోజులు ఇవే…
- భాద్రపద శుద్ధ తదియ వరాహ జయంతి
- భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చవితి
- భాద్రపద శుద్ధ పంచమి ఋషి పంచమి
- భాద్రపద శుద్ధ షష్ఠి సుర్య షష్ఠి
- భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన ఏకాదశి
- భాద్రపద శుద్ధ ద్వాదశి వామన జయంతి
- భాద్రపద శుద్ధ చతుర్దశి అనంత పద్మనాభ వ్రతం
- భాద్రపద పూర్ణిమ మహాలయ పౌర్ణమి
- భాద్రపద బహుళ పాడ్యమి మహాలయ పక్షము ప్రారంభం
- భాద్రపద బహుళ తదియ ఉండ్రాళ్ళ తద్దె
- భాద్రపద బహుళ ఏకాదశి ఇంద్రఏకాదశి
- భాద్రపద బహుళ త్రయోదశి కలియుగము ప్రారంభమైన రోజు.
- భాద్రపద బహుళ చతుర్దశి మాసశివరాత్రి
- భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య




