అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ క‌ల్యాణ‌ వేంకటేశ్వరస్వామి

 

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ‌ వేంకటేశ్వర‌స్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి 7 గంట‌ల‌కు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు.

వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *